Andhra Pradesh: హీరో అల్లు అర్జున్ కు జరిమానా విధించిన సైబరాబాద్ పోలీసులు!

  • ఇటీవల ఫాల్కన్ కారవ్యాన్ కొన్న బన్నీ
  • బ్లాక్ ఫిల్మ్ తో వెళుతుండగా పోలీసులకు ఫిర్యాదు
  • నిబంధనల మేరకు జరిమానా విధించిన పోలీసులు

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఓ కారవ్యాన్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దానికి ఫాల్కన్ గా బన్నీ అప్పట్లో పేరు కూడా పెట్టాడు. తాజాగా ఈ కారవ్యానుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 16న సాయంత్రం 4.25 గంటలకు టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల కారవ్యాను హిమాయత్ నగర్ ప్రాంతంలో వెళుతోంది.

ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాగా, అదే మార్గంలో వెళుతున్న మహమ్మద్ అబ్దుల్ అజాం అనే వ్యక్తి దాన్ని గమనించాడు. నిబంధనలకు విరుద్ధంగా కారవ్యాన్ అద్దాలు బ్లాక్ ఫిల్మ్ తో ఉండటాన్ని గమనించి ఫొటో తీసి ట్విట్టర్ లో సైబరాబాద్ పోలీసులకు పంపాడు. దీంతో ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆ వాహనం యజమాని అల్లు అర్జున్ కు రూ.735 జరిమానా విధిస్తూ చలాన్ రాశారు.

Andhra Pradesh
Telangana
Tollywood
Allu Arjun
cyberabad
Police
challan
  • Loading...

More Telugu News