Andhra Pradesh: ఏపీలో మంద కృష్ణ మాదిగను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • వర్గీకరణ అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నిరసన
  • ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపు నిచ్చిన మంద కృష్ణ
  • జగ్గయ్యపేట వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ‘ఛలో అసెంబ్లీ’ చేపడతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంద కృష్ణ మాదిగను జగ్గయ్యపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు సమాచారం. కాగా, చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం దళితులను చీల్చడానికేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జగన్ వ్యాఖ్యానించడం తగదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ మాట తప్పారని ఆరోపించారు.  

Andhra Pradesh
assembly
MRPS
Manda krishna
  • Loading...

More Telugu News