Koti: సినిమా సంగీతానికి విలువ పడిపోతూ వస్తోంది: కోటి
- మా అప్పటి పరిస్థితులు వేరు
- ఇప్పటి పరిస్థితులు వేరు
- ఇప్పుడు విలువా లేదు .. క్వాలిటీ లేదు
సంగీత దర్శకుడిగా కోటికి ఎంతో క్రేజ్ వుంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించిన ఆయన, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఒకప్పుడు సంగీత దర్శకులుగా మాకు .. సంగీతానికి ఎంతో విలువ ఉండేది. గాయనీగాయకులకు .. పాటల రచయితలకు మంచి విలువ ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరు తక్కువ బడ్జెట్లో మ్యూజిక్ ను అందిస్తే వాళ్లతో చేయిస్తున్నారు. ఎవరు తక్కువకు పాడితే వాళ్లతో పాడిస్తున్నారు. ఎవరు పడితే వాళ్లు రాసేస్తున్నారు .. తీసేస్తున్నారు. క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేవారు కనిపించడం లేదు. ఇలాంటివాళ్లు ఒకటి రెండు సినిమాలకి మించి మళ్లీ కనిపించడం లేదు. అన్ని చిత్రపరిశ్రమల్లోను ఇదే పరిస్థితి వుంది. ఏమైనా అంటే ఇది స్పీడ్ యుగం అనేస్తున్నారు" అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.