NIKE shoes: ఒలింపిక్స్‌లో ట్రయిల్‌ రన్నర్లు వాడిన నైక్‌ షూస్‌... వేలంలో రూ.3 కోట్లు!

  • ఈ అరుదైన స్నీకర్స్‌ను వేలం వేసిన సోథిబే సంస్థ
  • 1972లో ‘మూన్‌ షూ’ పేరుతో విడుదల
  • వేలంలో వీటిని దక్కించుకున్న కెనడాకు చెందిన మైల్స్‌ నాదల్‌

ఆమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ నైక్‌ షూస్‌ గురించి తెలియని వారు అరుదు. సాధారణ బ్రాండ్లతో పోల్చితే వీటి ఖరీదు కూడా అధికమే. అయితే 1972 ఒలింపిక్స్‌లో ట్రయిల్‌ రన్నర్ల కోసం ఈ సంస్థ రూపొందించిన ఓ జత షూస్‌ ధర వేలంలో రూ.3 కోట్లు పలకడం విశేషం. ‘మూన్‌ షూ’ పేరుతో నైక్‌ డిజైన్‌ చేసిన ఈ అరుదైన స్నీకర్స్‌ను న్యూయార్క్‌లో సోథిబే సంస్థ నిన్న వేలం వేసింది. కెనడాకు చెందిన మైల్స్‌ నాదల్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో వీటిని 4,37,500 డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ.3 కోట్లు)కు దక్కించుకున్నాడు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.

అప్పట్లో నైక్‌  సహ వ్యవస్థాపకుడు బిల్‌ బోవర్‌మన్‌ డిజైన్‌ చేసిన ఈ మోడల్‌ షూస్‌ ను కేవలం 12 జతలు మాత్రమే నైక్‌ సంస్థ తయారు చేయగా అందులో ఈ జత ఒకటి. 1984లో ఒలింపిక్‌ బాస్కెట్‌ బాల్‌ ఫైనల్స్‌లో మైఖెల్‌ జోర్డాన్‌ ధరించిన కాన్‌వర్స్‌ స్నీకర్స్‌ను 2017లో సోథిబే సంస్థ వేలం వేయగా 1,90,373 డాలర్లకు అమ్ముడయ్యాయి. తాజాగా, ఒలింపిక్‌ రన్నర్స్‌ వినియోగించిన ఈ షూస్‌ రూ.3 కోట్లు పలకడం విశేషం.

  • Loading...

More Telugu News