Andhra Pradesh: ప్రపంచకప్ సెమీఫైనల్ లో ధోని రనౌట్ కాగానే నా గుండె ఆగిపోయినంత పనైంది!: హీరోయిన్ రష్మిక మందన

  • శుక్రవారం విడుదల కానున్న డియర్ కామ్రేడ్
  • సినిమా కోసమే క్రికెట్ నేర్చుకున్నానన్న రష్మిక
  • సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడి

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రష్మిక చెబుతూ.. ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం తాను క్రికెట్ నేర్చుకున్నట్లు తెలిపింది.

ఈ సినిమాలో నేను స్టేట్ లెవల్ క్రికెటర్ గా కనిపిస్తా. తెరపై నేను క్రికెటర్ గా కనిపించేది కాసేపే. కానీ ఆ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డాను. ఈ సినిమా కోసమే తొలిసారి బ్యాట్ పట్టుకున్నా. బాగా ప్రాక్టీస్ చేశా. క్రికెట్ పరిభాషను తెలుసుకున్నా. ఇటీవల ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ధోనీ రనౌట్‌ కావడం బాధ కలిగించింది. ఒక్కసారి గుండె ఆగిపోయినంత పనైంది. మనకే అలా ఉంటే, మైదానంలో వేలాదిమంది సమక్షంలో ఆడేవాళ్లకు ఎలా ఉంటుందో ఊహించండి’ అని చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు రష్మిక తెలిపింది. తనకు తెలుగు రాకపోయినా డబ్బింగ్ చెప్పుకున్నాననీ, అందుకు 60 రోజులు పట్టిందని పేర్కొంది.

Andhra Pradesh
Telangana
Tollywood
Dear Comrade
Rashmika mandana
Rashmika Mandanna
  • Loading...

More Telugu News