Andhra Pradesh: నీకు నటన రాదు అని విమర్శించినవాళ్లు చాలామంది ఉన్నారు!: హీరోయిన్ రష్మిక

  • అలాంటి విమర్శలకు నేను కుంగిపోలేదు
  • సవాలుగా తీసుకుని నటించి చూపించాను
  • మహేశ్, బన్నీలతో సినిమాలకు ఓకే చెప్పా

‘నీకు నటన రాదు. ఇంకా ఎదగాలి’ అని విమర్శించినవాళ్లు చాలామంది ఉన్నారని ‘డియర్ కామ్రేడ్’ నాయిక రష్మిక మందన తెలిపింది. ఇలాంటి మాటలు విన్నప్పుడు తాను కుంగిపోలేదని స్పష్టం చేసింది. ‘నీకు రాదు. చేతకాదు’ అని ఎవరైనా చెప్పారంటే వాళ్లకు తానేంటో చేసి చూపించానని వ్యాఖ్యానించింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడింది. ప్రస్తుతం తాను నితిన్ తో కలిసి ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాననీ, త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని రష్మిక చెప్పింది.

‘స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే అది కచ్చితంగా నా ప్రతిభే. నటించడం సులువని  చాలామంది అంటారు. కానీ మనదికాని పాత్రలోకి పరకాయప్రవేశం చేయడం ఎంత కష్టమో అనుభవిస్తే కానీ తెలియదు. ఫ్రేమ్ లో కాస్త నవ్వాల్సి వచ్చినా, ఆ నవ్వు వెనుక ఉన్న భావాల్ని ప్రేక్షకులకు చూపించగలగాలి. గ్లిజరన్ పెట్టుకుని ఏడ్చే అలవాటు నాకు లేదు. ఆ సందర్భాన్ని మనుసులోకి తీసుకుంటే తప్ప భావాలను పలికించలేం’ అని రష్మిక తెలిపింది. రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్' ఈ నెల 26న (శుక్రవారం) విడుదల కానుంది.

Andhra Pradesh
Telangana
Tollywood
Dear Comrade
rashmika
interview
  • Loading...

More Telugu News