Janasena: గొప్పల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పాకులాడుతున్నాయి: జనసేన ఎమ్మెల్యే రాపాక

  • అప్పటి తీరుకు ఇప్పుడు పగ తీర్చుకుంటోంది
  • సభా గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలి
  • ప్రజా సమస్యలపై చర్చించడం మానేశారు

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ మానేసి, గొప్పల కోసం అధికార, ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సభా సంప్రదాయాలు ఏమాత్రం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ వ్యవహరించిన తీరుకు ఇప్పుడు అధికార పక్షం పగ తీర్చుకుంటోందని, ఈ పద్ధతిని వీడాలని రాపాక అన్నారు. సభా గౌరవాన్ని కాపాడేలా సభ్యులు వ్యవహరించాలని హితవు పలికారు.  

Janasena
Rapaka Varaprasad
Telugudesam
Revenge
Assembly
  • Loading...

More Telugu News