Shami: ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించిన షియోమీ

  • అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఆఫర్లు
  • జులై 25వ తేదీ వరకూ వినియోగదారులకు లభ్యం
  • పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ.3,300 వరకూ తగ్గింపు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాత ఫోన్ ఎక్సేంజ్‌పై రూ.3,300 వరకూ తగ్గింపుతో పాటు, మరికొన్ని ఫోన్లపై మొత్తంగా రూ.7500 రాయితీని ప్రకటించింది. అంతే కాకుండా ఎస్‌బీఐ బ్యాంకు ఆఫర్ కింద మరో 5 శాతం రాయితీని అందిస్తోంది.

షియోమీ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఫోన్లపై ఈ భారీ ఆఫర్లను ప్రకటించింది. జులై 25 వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో వుంటాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్లు అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ.కామ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా ఒకప్పుడు రూ.11,999 ఉన్న షియోమీ ఎంఐ ఏ2 ఇప్పుడు రూ.9,999కే లభిస్తోంది.

ఇక రెడ్‌మి వేరియంట్స్‌పై ఎన్నో ఆఫర్లను సంస్థ అందిస్తోంది. రెడ్‌మి 7, 2జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ ఇప్పుడు రూ.7,499లకే లభించనుండగా, 3జీబీ ర్యామ్‌ ఉన్న మొబైల్‌ను రూ.8,499లకే అందిస్తోంది. అలాగే ఈ రెండు ఫోన్లపై రూ.500 తగ్గింపును ప్రకటించింది.

రెడ్‌మీ 6ఏ (2జీబీ ర్యామ్‌+32జీబీ) అయితే రూ. 6,999కి, రెడ్‌మి 6ప్రో (4జీబీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌) రూ.8,499లకే లభించనుంది. 48 మెగాపిక్సెల్‌ కెమెరా కలిగిన రెడ్‌మి నోట్‌ 7ఎస్‌ రూ.1000 రాయితీతో రూ.9,999లకే లభించనుంది. 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న రెడ్‌మి వై3 మొబైల్‌ రూ.8,999కి, 4జీబీ ర్యామ్‌+64జీబీ వేరియంట్‌ రూ.10,999గా ఉంది. రెండు ఫోన్లు రూ.1000 రాయితీతో లభిస్తున్నాయి.

Shami
Mobile
Amezon
Flipcart
MI.Com
Exchange
Redmi Y3
  • Loading...

More Telugu News