Salman Khan: ఆ ఎపిసోడ్ చూశాక ఎందుకంత ఎక్కువగా మాట్లాడుకున్నామని సల్మాన్, నేను ప్రశ్నించుకున్నాం: రవీనా

  • 120 ఏళ్లుగా తెలుసని సల్మాన్ చెబుతుంటాడు
  • మా మధ్య ఉన్న స్నేహం అలాంటిది
  • మేము మాట్లాడుకున్నట్టు పెద్దగా చూపించలేదు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్ బలియే’ డ్యాన్స్ రియాల్టీ షోకి హాజరైన బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆ షోలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తను 120 ఏళ్లుగా తెలుసని సల్మాన్ అందరితో చెబుతుంటాడని, తమ మధ్య ఉన్న స్నేహం అంత గొప్పదని రవీనా టాండన్ పేర్కొన్నారు. ఆ షోలో తాను, సల్మాన్ ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నామని ఆమె తెలిపారు.

అయితే కార్యక్రమం ప్రసారమైనప్పుడు మాత్రం తాము మాట్లాడుకున్నట్టు పెద్దగా చూపించలేదని రవీనా పేర్కొన్నారు. ముఖ్యంగా 29 ఏళ్ల క్రితం తామిద్దరం కలిసి నటించిన ‘పత్తర్‌ కే ఫూల్‌’ సినిమా గురించి షోలో ఎక్కువగా చర్చించుకున్నామని, కానీ ఎపిసోడ్ చూశాక మాత్రం ఎందుకింత ఎక్కువగా మాట్లాడుకున్నామని ఒకరినొకరం ప్రశ్నించుకున్నామని, అలా మాట్లాడకపోయి ఉంటే ఎపిసోడ్‌ను కట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదని రవీనా వెల్లడించారు.

Salman Khan
Ravina Tandon
Nach Baliye
Reality Show
Pathar Ke Pool
  • Loading...

More Telugu News