Paruchuri: రాజకీయాల్లో ఉంటూనే పవన్ సినిమాలు చేయాలి: పరుచూరి గోపాలకృష్ణ

  • పవన్ మళ్లీ మేకప్ వేసుకోవాలి 
  • సామాజిక సమస్యలను కథాంశాలుగా చేసుకోవాలి
  • ఎంజీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పవన్ కల్యాణ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలు వచ్చేవరకూ మేకప్ కి దూరంగా ఉండొద్దు. ఒక వైపున రాజకీయ కార్యకలాపాలు చక్కబెడుతూనే మరో వైపున సినిమాలు చేయాలి. పవన్ తను చెప్పదలచుకున్నది సినిమాల ద్వారా చెప్పవచ్చు .. ప్రభావితం చేయవచ్చు.

ఈ విషయంలో ఆయన ఎమ్జీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎమ్జీఆర్ ఒక వైపున రాజకీయ కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తూనే మరో వైపున సినిమాలు చేస్తూ వెళ్లారు. ఒక సాధారణ వ్యక్తి ఇంటింటికీ తిరిగి చెప్పే ఒక మాటను .. ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో చెబితే సరిపోతుంది. ఆరిస్ట్ చేసుకున్న అదృష్టం అది. అందువలన పవన్ ఈ ఐదేళ్లలో సామాజిక సమస్యలపై స్పందించే కథాంశాలను ఎంచుకుని, ప్రజలను ఉత్తేజపరుస్తూ వెళితే బాగుంటుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

Paruchuri
Pavan Kalyan
  • Loading...

More Telugu News