Andhra Pradesh: ‘అమరావతి’కి మరో ఎదురుదెబ్బ.. తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఏఐఐబీ

  • అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేం
  • ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం
  • గతంలో 200 మిలియన్ డాలర్లు ఇస్తామన్న బ్యాంకు

అమరావతిలో పెట్టుబడులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ బ్యాంకు నిర్ణయం తర్వాత అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు మరో పెద్ద బ్యాంకు ప్రకటించింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్స్ బ్యాంకు (ఏఐఐబీ) ప్రకటించింది. కాగా, అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. కానీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వ వైఖరి చూశాక రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్టు సమాచారం.

Andhra Pradesh
amaravathi
AIIB
Funds
  • Loading...

More Telugu News