Sensex: వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
  • 48 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 15 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం, దేశీయంగా బలహీన సంకేతాలు ఉండటం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయి 37,982కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 11,331 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.94%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.76%), హీరో మోటో కార్ప్ (2.50%), ఏషియన్ పెయింట్స్ (1.90%), ఎన్టీపీసీ (1.60%).  

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.49%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ( -2.24%), బజాజ్ ఆటో (-1.57%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.44%), ఓఎన్జీసీ (-1.13%).

  • Loading...

More Telugu News