Andhra Pradesh: అన్యాయంగా నాపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలి: ఏపీ సభాపతికి అచ్చెన్నాయుడు లేఖ

  • నా స్థానంలో ఉండి నిరసన తెలిపినా సస్పెండ్ చేశారు
  • ఈ చర్యతో చాలా ఆశ్చర్యానికి గురయ్యా
  • మార్షల్స్ తో నన్ను బయటకు పంపి అవమానించారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శాసనసభాపతికి అచ్చెన్నాయుడు ఓ లేఖ రాశారు. తాము అడిగిన ప్రశ్నలకు అధికారపక్ష సభ్యులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో తన స్థానం నుంచే నిరసన తెలిపానని అన్నారు. తన స్థానంలో ఉండి నిరసన తెలిపినా తనను సస్పెండ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. మార్షల్స్ తో బయటకు పంపి తనను అవమానించారని, శాసనసభ్యుడినైనా తన హక్కులను హరించారని, అన్యాయంగా తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని ఆ లేఖలో కోరారు.

Andhra Pradesh
Assembly
speaker
atchanaidu
  • Loading...

More Telugu News