Municipal Bill: కేసీఆర్ సర్కారుకు గవర్నర్ షాక్... మునిసిపల్ బిల్లు తిరస్కరణ.. కొత్తగా ఆర్డినెన్స్!

  • అసెంబ్లీలో ఆమోదం పొందిన మునిసిపల్ బిల్లు
  • కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్న గవర్నర్
  • సవరణలతో ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ షాకిచ్చారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఆమోదం పొందిన కొత్త మునిసిపల్ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన ఆయన, కొన్ని సవరణలు చేయాలని సూచించారు. ఈ బిల్లును కేంద్రానికి పంపాలని నిర్ణయిస్తూ, దాన్ని రిజర్వ్ లో ఉంచినట్టు తెలిపారు. కాగా, అసెంబ్లీ ఇప్పటికే నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం మునిసిపల్ బిల్లుపై ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ముందడుగు వేసింది.

Municipal Bill
KCR
Governer
ESL Narasimhan
  • Loading...

More Telugu News