Jagan: జగన్ ఎంత మోసగాడో వీడియో క్లిప్ చూస్తే తెలిసిపోతుంది: అచ్చెన్నాయుడు

  • నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు
  • జగన్ హామీలపైనే మేం నిలదీశాం
  • ప్రభుత్వం మాట విని స్పీకర్ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు

తనకు కేటాయించిన స్థానం నుంచి కదలకుండా కూర్చున్న తనను అన్యాయంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ నుంచి మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, జగన్ ఇచ్చిన హామీలపైనే తాము నిలదీశామని చెప్పారు. 45 ఏళ్లకే పెన్షన్ అని జగన్ హామీ ఇచ్చారని... దానిపై ప్రశ్నించామని తెలిపారు. పాదయాత్రలో దగా హామీలను జగన్ ఇచ్చారని విమర్శించారు. జగన్ ఎంత మోసగాడో వీడియో క్లిప్ చూస్తే తెలిసిపోతుందని చెప్పారు. సభలో వీడియోలు ప్రదర్శించే అవకాశాన్ని ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం మాట విని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని స్పీకర్ కు సూచించారు.

Jagan
Achennaidu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News