Whats app: వాట్స్ యాప్ లో మరో సరికొత్త ఫీచర్!

  • ఆడియో క్లిప్ ను పరిశీలించుకునే చాన్స్
  • ఆపై మాత్రమే అవతలి వ్యక్తికి ఫార్వార్డ్
  • అతి త్వరలో అందుబాటులోకి

ఇప్పటికే పలు రకాల అప్ డేట్స్ ను విడుదల చేసిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్, వాట్స్ యాప్ మరో తాజా ఫీచర్ ను పరిచయం చేయనుంది. మామూలుగా వాట్స్ యాప్ లో వీడియో అయినా, టెక్ట్స్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు.

దీనివల్ల తప్పుడు సందేశాలు పంపే అవకాశాలు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన వాట్స్ యాప్, రికార్డింగ్ ను పరిశీలించి, సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఆడియో రికార్డును మరోసారి చెక్ చేసుకున్న తరువాతే, అవతలి వ్యక్తికి చేరేలా అప్ డేట్ ను సిద్ధం చేశామని, ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ లో బీటా దశలో ఉందని, అతి త్వరలో అందరు యూజర్లకూ అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది.

Whats app
Recordings
Text Message
Update
  • Loading...

More Telugu News