Andhra Pradesh: వరల్డ్ బ్యాంకు ప్రకటనలో ఎక్కడా అవినీతి గురించి మాట్లాడలేదు: చంద్రబాబు

  • వైసీపీ నేతలు కావాలనే అవినీతి ఆరోపణలు
  • వాస్తవాలను వక్రీకరిస్తున్నారు
  • ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరం

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వమని వరల్డ్ బ్యాంకు చేసిన ప్రకటనలో ఎక్కడా అవినీతి గురించి ప్రస్తావించలేదని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ నేతలు కావాలనే గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరించి వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడమనేది చాలా దురదృష్టకరమని, అశుభమని అన్నారు. ఏపీ భవిష్యత్ ను, ప్రతిష్టను మంట గలిపే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూర్ఖత్వంగా ప్రవర్తించినా కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా బ్యాలెన్స్ డ్ గా ఉండాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

Andhra Pradesh
Chandrababu
world bank
jagan
  • Loading...

More Telugu News