koganti satyma: కోగంటి సత్యంను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- కోగంటి సత్యంకు ముగిసిన పోలీస్ కస్టడీ
- ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడి
- 30 సార్లు రెక్కీ నిర్వహించారట
ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంకు పోలీస్ కస్టడీ ముగిసింది. కోగంటి సత్యంను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కాగా, సత్యంతో పాటు ఎనిమిది మందిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. రాంప్రసాద్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర 30 సార్లు రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లేందుకు రాంప్రసాద్ సిద్ధపడడంతో హత్యకు ప్లాన్ చేశామని కోగంటి సత్యం చెప్పినట్టు సమాచారం.