Jevan reddy: పిల్లగాడు జగన్ ను చూసి నేర్చుకో... కేసీఆర్ కు జీవన్ రెడ్డి సలహా!

  • ఉద్యోగులకు ఐఆర్, రైతు రుణమాఫీ ఎక్కడ
  • ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తొస్తాయా?
  • జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి

చిన్న పిల్లవాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ను చూసి, ఎలా పరిపాలించాలో కేసీఆర్ నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జగిత్యాలలో మీడియాతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగులకు నెలసరి భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రమే కేసీఆర్ కు హామీలు గుర్తుకు వస్తాయని ఆరోపించిన ఆయన, అసెంబ్లీ ఎన్నికల నాటికి రైతు బంధు పథకం కేసీఆర్ కు గుర్తుకు వచ్చిందని, మునిసిపల్ ఎన్నికల సమయానికి ఆసరా పెన్షన్లు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. గతంలో రెవెన్యూ ఉద్యోగులను పొగిడిన కేసీఆర్, ఇప్పుడు వారిని తిడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తనను ప్రశ్నించిన వారిపై అవినీతి ముద్ర వేయడం కేసీఆర్ కు అలవాటై పోయిందని, జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News