KIA Motors: జీతాలు తక్కువగా ఇస్తున్నారంటూ కియా ఉద్యోగుల ఆందోళన

  • అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు చెప్పిన జీతాలు ఇవ్వడం లేదు
  • భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదు
  • ప్రశ్నిస్తే.. వెళ్లిపొమ్మంటున్నారు

అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ అనుబంధ సంస్థ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతం విషయంలో యాజమాన్యం తమను మోసం చేస్తోందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇస్తామన్న జీతాన్ని... విధుల్లో చేరిన తర్వాత ఇవ్వడం లేదని, తక్కువ జీతాన్ని ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని మండిపడ్డారు. న్యాయం చేయాలని అడిగితే... మీ అవసరం లేదంటూ బయటకు పంపేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

KIA Motors
Employees
Protest
  • Loading...

More Telugu News