Andhra Pradesh: ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పేసింది.. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు!: పురందేశ్వరి

  • హోదా విషయంలో సీఎం వైఖరి సరికాదు
  • సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు
  • గుంటూరులోని తెనాలిలో మీడియాతో పురందేశ్వరి

ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పిందనీ, అయినా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నేత పురందేశ్వరి విమర్శించారు. ప్రత్యేకహోదా విషయంలో ముఖ్యమంత్రి జగన్ వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఈరోజు పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

సీఎం జగన్ చెబుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల అనేకమందికి ఇబ్బందులు తలెత్తుతాయని పురందేశ్వరి తెలిపారు. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంపై కూడా ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీ బీజేపీలో చాలామంది ఇతర పార్టీల నేతలు చేరుతున్నారనీ, దీన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
puramdeswari
BJP
Cheating
Special Category Status
  • Loading...

More Telugu News