MSK Prasad: అంబటి రాయుడు భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం: ఎమ్మెస్కే ప్రసాద్

  • వరల్డ్ కప్ టీమ్ లో రాయుడికి మొండిచేయి
  • సెలెక్టర్లపై సెటైర్ వేసిన రాయుడు
  • తమకు ఎవరి విషయంలోనూ ద్వేషం లేదన్న ఎమ్మెస్కే

వరల్డ్ కప్ కు టీమిండియాను ఎంపిక చేసిన సమయంలో అంబటి రాయుడు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంపై రాయుడు స్పందిస్తూ త్రీడీ కళ్లజోడు కొనుక్కుని వరల్డ్ కప్ చూస్తానంటూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై పంచ్ వేశాడు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏకంగా క్రికెట్ కే గుడ్ బై చెప్పేశాడు. అయితే, తాజాగా వెస్టిండీస్ టూర్ కు వెళ్లే టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ అంబటి రాయుడు విషయంలో స్పందించాడు.

ప్రపంచకప్ కోసం నిష్పాక్షికంగా జట్టును ఎంపిక చేశామని వెల్లడించాడు. అంబటి రాయుడు భావోద్వేగాలను అర్థంచేసుకున్నామని వివరించాడు. అయితే, జట్టు ఎంపికలో తమకు కొన్ని ప్రమాణాలు ఉంటాయని, ఎవరి విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేవని స్పష్టం చేశాడు. ఇక ధోనీ రిటైర్మెంటు గురించి మాట్లాడుతూ, అది ఆయన వ్యక్తిగత విషయం అని తేల్చిచెప్పాడు.

MSK Prasad
Ambati Rayudu
MS Dhoni
India
Cricket
  • Loading...

More Telugu News