Andhra Pradesh: ఎన్ని జాకీలు పెట్టిలేపినా ఉప్పల్ బాలు ‘ఎస్పీ బాలు’ కాలేడు!: నారా లోకేశ్ పై వరప్రసాద్ సెటైర్లు

  • లోకేశ్ 3 మంత్రిత్వశాఖలు నిర్వహించారు
  • ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ చార్జి అయ్యారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

వైసీపీ నేత, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ టీడీపీ నేత నారా లోకేశ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎక్కడైనా ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ కావడం, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ కావడం ఖాయమని వరప్రసాద్ తెలిపారు. కానీ మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన నారా లోకేశ్ చివరికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. ‘ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అంటే ఇదేనేమో’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘స్టాన్ ఫోర్ట్ నిశానీ, రాజకీయ అజ్ఞానిని మూడు శాఖలకు మంత్రిగా చేసేందుకు ఈనాడులో ‘ఈతరం నాయకుడు’ ఆంధ్రజ్యోతిలో ‘ఆంధ్రుల ఆశాకిరణం’ అని రాస్తూ జాకీలు వేశారు. చివరకు సోషల్ మీడియా ఇంచార్జి అయ్యాడు. ఎవరు ఎన్ని జాకీలు వేసినా ఉప్పల్ బాలు ఎస్పీ బాలు కాలేడుగా.. ఇదీ అంతే’’ అని సెటైర్లు వేశారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
varaprasad
Nara Lokesh
Twitter
  • Loading...

More Telugu News