Manda Krishna: దళితుల కోసం ఏం చేయాలో జగన్ కు తెలుసు.. మంద కృష్ణ చెప్పక్కర్లేదు!: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

  • జగన్ పై విమర్శలు చేసిన మంద కృష్ణ
  • ఘాటుగా స్పందించిన బాపట్ల ఎంపీ
  • హైదరాబాద్ నుంచి వచ్చి హడావుడి చేయడం వెనుక ఆంతర్యమేంటని నిలదీత

సీఎం జగన్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని, చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కూ పడుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ త్రీవస్థాయిలో స్పందించారు. దళితుల కోసం ఏంచేయాలో జగన్ కు తెలుసని, మంద కృష్ణ చెప్పాల్సిన అవసరంలేదని అన్నారు. 15 రోజుల క్రితం జగన్ ను పొగిడిన మంద కృష్ణ, ఇప్పుడు తిట్టడం వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో దళితులకు బాగా తెలుసని నందిగం వ్యాఖ్యానించారు.

అయినా, ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత హడావుడి చేయడం వెనుక ఆంతర్యం ఏంటో మంద కృష్ణ చెప్పాలని నిలదీశారు. దళితుల కష్టాలన్నీ తీరిపోతే తన ప్రయోజనాలు దెబ్బతింటాయని మంద కృష్ణ ఆందోళన చెందుతున్నారని నందిగం పేర్కొన్నారు. అయినా వర్గీకరణ కేంద్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఏం సంబంధం అని ప్రశ్నించారు.

Manda Krishna
Nandigam Suresh
Bapatla
YSRCP
Jagan
Chandrababu
MRPS
  • Loading...

More Telugu News