Manda Krishna: చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కూ పడుతుంది: మంద కృష్ణ

  • ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  • నా పాదయాత్రకు అనుమతించకపోవడం దారుణం
  • ఈ నెల 22 నుంచి 27 వరకు కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మరోసారి మండిపడ్డారు. జగన్ పాలన ఎలా ఉండబోతోందో రెండు నెలల్లోనే అర్థమైపోయిందని అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. పోలీసులతో అణచి వేయాలని చూస్తే... చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి 27 వరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద దీక్షలు చేపడతామని తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Manda Krishna
MRPS
Jagan
YSRCP
  • Loading...

More Telugu News