Andhra Pradesh: భువనేశ్వర్ లో ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ తో విజయసాయిరెడ్డి భేటీ

  • గవర్నర్ కు శుభాకాంక్షలు చెప్పిన విజయసాయిరెడ్డి
  • శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటం బహూకరణ
  • లింగరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏపీకి గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ తో ఈరోజు భేటీ అయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో హరిచందన్ ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి ఆయనకు ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా హరించదన్ కు శాలువా కప్పి, శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఏపీ, ఒడిశాలోని రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. అనంతరం హరిచందన్ తో కలిసి లింగరాజస్వామి ఆలయాన్ని విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా, ఏపీ నూతన గవర్నర్ గా నియమితులైన హరిచందన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం రాజ్ భవన్ వద్ద ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ పనులను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్పీ సిసోడియా, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా  పరిశీలించారు. ఈ నెల 23న భువనేశ్వర్ నుంచి తిరుపతికి హరిచందన్ వస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని విజయవాడకు బయలుదేరుతారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నాక 24వ తేదీన ఉదయం 11.30 గంటలకు గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు.

  • Loading...

More Telugu News