Narendra Modi: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం సలహాలు కోరుతున్న ప్రధాని మోదీ

  • ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం
  • ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ ట్వీట్
  • 130 కోట్ల మంది ప్రజలకు మీ ఆలోచనలు వినిపించడంటూ విజ్ఞప్తి

ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుంచి ప్రసంగించడం ఆనవాయితీ. నరేంద్ర మోదీ కూడా ప్రధానమంత్రి హోదాలో స్వాతంత్ర్య దినోత్సవం కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన ప్రసంగం కోసం సలహాలు స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. తన ప్రసంగంలో పేర్కొనబోయే అంశాలపై సలహాలు, సూచనలు పంపాల్సిందిగా కోరారు. "ఆగస్టు 15న నేనిచ్చే ప్రసంగం కోసం మీ విలువైన సలహాలు కావాలి. మీ నుంచి సలహాలు, సూచనలు కోరడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. ఎర్రకోట నుంచి మీ ఆలోచనలను 130 కోట్ల మంది భారతీయులకు వినిపించండి"అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు నమో యాప్ లోని ఓపెన్ ఫోరమ్ లో ఆలోచలను పంచుకోవాలని సూచించారు.

Narendra Modi
Red Fort
New Delhi
Independance Day
  • Loading...

More Telugu News