Karnataka: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి రెండో డెడ్ లైనూ ముగిసింది!

  • ఈ సాయంత్రం 6 లోపు మెజార్టీ నిరూపించుకోమన్న గవర్నర్
  • పట్టించుకోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం
  • చర్చ ముగిసే వరకూ బలపరీక్ష కుదరదన్న సీఎం

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాలంటూ సీఎం కుమారస్వామికి నిన్న, ఈరోజు గవర్నర్ వాజూ భాయ్ వాలా లేఖలు రాసిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం 1.30 గంటల లోపు బలనిరూపణ చేసుకోవాలని మొదటి లేఖలో గవర్నర్ చేసిన సూచించారు. అలా జరగకపోవడంతో, ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు మెజార్టీ నిరూపించుకోవాలని రెండో లేఖలో ఆయన సూచించారు.

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాసపరీక్షకు గవర్నర్ విధించిన రెండో డెడ్ లైన్ సమయం ముగిసింది కానీ, ఎటువంటి ఫలితమూ లేదు. విశ్వాసపరీక్ష తీర్మానంపై చర్చ ముగిసే వరకూ బలపరీక్ష కుదరదని సీఎం కుమారస్వామి చెబుతుండటం గమనార్హం. బీజేపీ నేతల ఒత్తిడితోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Karnataka
congress
Jds
Governor
cm
  • Loading...

More Telugu News