Ismart Shankar: పూరి జగన్నాథ్ పై రామ్ వెరైటీ ప్రశంసలు

  • మిమ్మల్ని బూతులతో పొగడబుద్ధి అవుతోంది
  • మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు
  • మీ ప్రేమ స్క్రీన్ పై కనపడింది

రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి రామ్ ట్వీట్ చేశాడు. 'డియర్ పూరి జగన్నాథ్ గారు, సినిమా నచ్చితే పొగుడుతాం. నచ్చకపోతే బూతులు తిడతాం. కానీ మిమ్మల్ని మాత్రం బూతులతో పొగడబుద్ధి అవుతోందేంటండీ? నాపై మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రేమ స్క్రీన్ పై కనపడింది' అని ట్వీట్ చేశాడు.

Ismart Shankar
Tollywood
Puri Jagannadh
Ram
  • Loading...

More Telugu News