Andhra Pradesh: ఏపీలో భారీగా పెరగనున్న మద్యం ధరలు

  • కనీసం రూ. 50 పెరగనున్న క్వార్టర్ ధర
  • చీప్ లిక్కర్ నుంచి ఖరీదైన మద్యం వరకు పెరగనున్న ధరలు
  • మూతపడనున్న 20 శాతం వైన్ షాపులు

ఏపీలోని మందుబాబులకు కిక్కు దిగిపోయే వార్త ఇది. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచబోతోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త విధానంలో క్వార్టర్ పై కనీసం రూ. 50 పెరగనున్నట్టు సమాచారం. చీప్ లిక్కర్ దగ్గర నుంచి ఖరీదైన బ్రాండ్ల వరకు భారీగా వడ్డించనున్నారు. నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేపట్టనుంది. అంతేకాదు రాష్ట్రం మొత్తం మీద 20 శాతం వైన్ షాపులు మూతపడుతున్నాయి. ఐదేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనే నిర్ణయంలో భాగంగా క్రమంగా మద్యం షాపుల సంఖ్యను తగ్గించబోతున్నారు.

Andhra Pradesh
Liquor
Rates
  • Loading...

More Telugu News