asutosh harbola: అమ్మ పాత్రను మరిపించిన నాన్న... తన చాంబర్‌లోనే బిడ్డకు పాలు పట్టించిన సీఈఓ!

  • సహచరుడు ఫొటో తీసి వాట్సాప్‌లో పోస్టింగ్
  • సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తున్న చిత్రం
  • బిడ్డ సంరక్షణలో అమ్మను మించి పోయారని నెటిజన్ల ప్రశంశలు

ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నా బిడ్డకు తండ్రేగా. ప్రేమ, వాత్సల్యం, మమకారం ఎక్కడికి పోతాయి. తల్లి జన్మనిస్తే తండ్రి జీవితాన్నిస్తాడంటారు. ఓ కంపెనీలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఈ సీఈఓ తన బిడ్డకు జీవితాన్నిస్తూ నెటిజన్ల మనసు గెల్చుకున్నారు. దేశరాజధాని ఢిల్లీకి సమీపాన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న నొయిడా నగరానికి చెందిన అశుతోష్‌ హర్బోలా ‘బుజోకా’ అనే మార్కెటింగ్‌ కంపెనీ సీఈఓ. నిత్యం వృత్తిపరమైన బాధ్యతలతో సతమతమయ్యే ఆయన తన కుమార్తె శ్లోకా విషయంలో అంతే బాధ్యత చూపిస్తూ కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకునే తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన కార్యాలయం గదిలోనే తన చిట్టి తల్లికి అశుతోష్‌ పాలు పట్టిస్తుండగా ఆయన సహచరుడు దుష్యంత్‌సింగ్‌ ఫొటో తీసి ట్విట్టర్‌లో ఉంచారు.

‘మా సీఈఓ అశుతోష్‌ను ఓసారి చూడండి. నిజమైన తండ్రిగా ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో నిబద్ధతతో వ్యవహరించే అశుతోష్‌ తన బిడ్డ విషయంలోనూ అదే నిబద్ధత కనబర్చి నిజమైన తండ్రి ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. హ్యాట్సాఫ్ టు  హిమ్‌’ అంటూ వ్యాఖ్య ఉంచారు. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

అంతటి స్థానంలో ఉండి కూడా బిడ్డ సంరక్షణ విషయంలో అశుతోష్‌ చూపిస్తున్న శ్రద్ధపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు వృత్తిపరమైన బాధ్యత, ఇటు కుటుంబపరమైన పనులను బ్యాలెన్స్ చేసుకోవడంలో సాధారణంగా  తల్లులు ఆకట్టుకుంటారని, అశుతోష్‌ తన చర్యతో వారిని మించిపోయారని పలువురు ప్రశంసించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News