Bigg Boss-3: 'బిగ్ బాస్'పై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తా

  • చిక్కుల్లో పడిన బిగ్ బాస్ నిర్వాహకులు
  • ఢిల్లీ చేరిన బిగ్ బాస్ వివాదం
  • ఫిర్యాదుతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను జతచేసిన శ్వేతారెడ్డి, గాయత్రి

గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్ బాస్ నిర్వాహకులు చిక్కుల్లో పడ్డారు. తెలుగు బుల్లితెరపై గత రెండు సీజన్లుగా విజయవంతం అయిన్ బిగ్ బాస్ షో తాజాగా మూడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. అయితే, బిగ్ బాస్ షోకి అవకాశం ఇచ్చే క్రమంలో నిర్వాహకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ వివాదం తాజాగా ఢిల్లీకి చేరింది. శ్వేతారెడ్డి, గాయత్రీగుప్తా తమకు ఎదురైన అనుభవాలను ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా తమ ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జత చేశారు. వీరిద్దరూ కొన్నిరోజుల క్రితం బిగ్ బాస్ నిర్వాహకులపై రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Bigg Boss-3
Swetha Reddy
Gayatri Gupta
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News