Amala Paul: పుదుచ్చేరి నుంచి వచ్చిన అమలా పాల్ కు తమిళ ప్రజలపై గౌరవం లేదు: తమిళనాడు మంత్రి ప్రియా రాజేశ్వరి

  • రేపు విడుదల కానున్న ఆడై చిత్రం
  • కొన్ని సీన్లలో నగ్నంగా నటించిన అమలా పాల్!
  • అమలా పాల్ పై తమిళనాడు మంత్రి విమర్శలు

'ఆడై' చిత్రంలో అమలా పాల్ నటించిన నగ్న సన్నివేశాలు యువతపై చెడు ప్రభావం చూపుతాయని తమిళనాడు మంత్రి ప్రియా రాజేశ్వరి మండి పడుతున్నారు. అమలా పాల్ చిత్ర పరిశ్రమకు వచ్చింది కేవలం డబ్బు కోసమేనని విమర్శించారు. అమలా పాల్ పుదుచ్చేరి నుంచి వచ్చిన అమ్మాయి అని, ఆమెకు తమిళ సంస్కృతి అన్నా, తమిళ ప్రజలన్నా గౌరవం లేదని అన్నారు. ఆడై చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో అసభ్యకర సన్నివేశాలున్న పోస్టర్లు ప్రదర్శించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రియా రాజేశ్వరి కోరారు. ఈ సినిమా తెలుగులో 'ఆమె' పేరుతో డబ్ అయింది. వి స్టూడియోస్ పతాకంపై రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అందరిలోనూ విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెల 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది.

Amala Paul
Aadai
Aame
Tollywood
  • Loading...

More Telugu News