Andhra Pradesh: కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం

  • ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
  • 1,33,867 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
  • అంగన్ వాడీ జీతాల పెంపు

అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమెదం తెలిపింది.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:
  • అంగన్ వాడీ జీతాల పెంపు. అంగన్ వాడీ వర్కర్లకు రూ. 11,500, మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ. 7 వేలు, అంగన్ వాడీ హెల్పర్లకు రూ. 7వేల జీతం. 
  • ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే  సరఫరా.
  •  జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం.
  • ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
  • 1,33,867 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్.
  • కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందిన బిల్లుకు ఆమోదం.
  • మద్య నిషేధం దిశగా తొలి దశ చర్యలకు శ్రీకారం. మద్యం దుకాణాల నిర్వహణ ప్రభుత్వానిదే.
  • గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ఆమోదం. నెలకు రూ. 5 వేల జీతం.
  • ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కు కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఏపీఐఐసీకి 149 ఎకరాల అప్పగింత.

  • Loading...

More Telugu News