Big boss-3: 'బిగ్ బాస్-3' వివాదం: ఎంపిక ప్రక్రియకు మద్దతుగా నిలిచిన కౌశల్!
- క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో బిస్ బాస్-3
- ట్విట్టర్ లో స్పందించిన బిస్ బాస్-2 విజేత
- ఎంపిక ప్రక్రియ నిజాయతీగా సాగుతుందని వ్యాఖ్య
త్వరలో ప్రారంభం కానున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్-3 క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-3ని నిషేధించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరో అక్కినేని నాగార్జున ఇంటివద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఈ గొడవపై బిగ్ బాస్-2 విజేత కౌశల్ మండ స్పందించాడు.
ఓ సామాన్య పౌరుడిగా బిస్ బాస్-2 విజేతగా ఈ కార్యక్రమంపై తనకు ఎంతో గౌరవం ఉందని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ ఎంతో నిజాయతీగా, పారదర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. బిస్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనబోతున్నవారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మేరకు కౌశల్ ట్విట్టర్ లో స్పందించాడు.