Imran khan: మోదీ శైలిని అనుకరిస్తున్న పాక్ ప్రధాని

  • ఈ నెల 22న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం
  • 21న పాక్ జాతీయులతో వాషింగ్టన్‌లో ర్యాలీ
  • నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న ఇమ్రాన్ వ్యతిరేక వర్గాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో పడేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం భారత ప్రధాని నరేంద్రమోదీని అనుకరిస్తున్నారు. ఈ నెల 22న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ఇమ్రాన్ ఖాన్ భేటీ కానున్నారు. అంతకు ముందు రోజు వాషింగ్టన్ డీసీలో  పాకిస్థాన్ కమ్యూనిటీతో కలిసి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. భారతదేశ నాయకులకు ఇటువంటి ర్యాలీలు సర్వసాధారణమే అయినా, అమెరికాలో ర్యాలీ నిర్వహించడం పాకిస్థాన్‌ ప్రధానికి ఇదే తొలిసారి. వాషింగ్టన్‌లోని కేపిటల్ ఎరీనాలో ఈ నెల 21న ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.

కాగా, అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించేందుకు సోమవారం అంతర్జాతీయ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. అయితే, ట్రంప్‌తో సమావేశానికి ముందు సయీద్‌ను అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, వాషింగ్టన్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ నిర్వహించనున్న ర్యాలీకి నిరసన సెగ తగిలేలా కనిపిస్తోంది. ఇమ్రాన్ ర్యాలీని అడ్డుకునేందుకు అసమ్మతి గ్రూపులు సిద్ధమవుతున్నాయి. ముహాజిర్లు, బలోచ్ గ్రూపులతోపాటు భుట్టో-జర్దారీ అనుకూల వర్గాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మద్దతుదారులు ఈ ర్యాలీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News