Adilabad District: చనాక-కొరాట బ్యారేజ్ పనుల్లో అపశ్రుతి.. ఇద్దరు కూలీల మృతి!

  • 16వ నెంబర్ గేటు బిగిస్తుండగా తెగిన లిఫ్ట్ వైర్  
  • రెండొందల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డ కూలీలు
  • మృతులు అసోంకు చెందిన వారిగా గుర్తింపు

ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాట బ్యారేజ్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇధ్దరు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న ఈ బ్యారేజ్ నిర్మాణ పనుల్లో భాగంగా గేట్లు బిగిస్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైర్ తెగిపడటంతో కూలీలు మృతి చెందారు. 16వ నెంబర్ గేటు బిగిస్తుండగా లిఫ్ట్ వైర్ తెగడంతో రెండు వందల అడుగుల ఎత్తులో నుంచి ఇద్దరు కూలీలు ఒక్కసారిగా కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అసోంకు చెందిన సురేశ్ బస్మతార్, దేబన్ బస్మతార్ గా గుర్తించారు. గాయపడ్డ ఇద్దరు కూలీలను రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Adilabad District
Jainath
chanaka-korata
barragae
  • Loading...

More Telugu News