Uttarakhand: మందు కొట్టి, తుపాకులు పట్టుకుని డ్యాన్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు!

  • ఉత్తరాఖండ్ కు చెందిన ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్
  • ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరణ
  • బీజేపీ జాతీయ మీడియా ఇన్ చార్జి అనిల్ బలూని వెల్లడి 

మందు కొట్టి, తుపాకులు పట్టుకుని డ్యాన్స్ చేసిన ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ పై పార్టీ వేటు వేసింది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఈరోజు వెల్లడించింది. ఈ చర్యపై పార్టీ అధిష్ఠానం ఆయన్ని వివరణ కోరింది. ప్రణవ్ సింగ్  చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని క్రమశిక్షణా కమిటీ నిర్ణయించినట్టు బీజేపీ జాతీయ మీడియా ఇన్ చార్జి అనిల్ బలూని పేర్కొన్నారు.  

కాగా, ఖాన్ పూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ డెహ్రాడూన్ లోని ఓ హోటల్ లో ఇటీవల మద్యం సేవిస్తూ, ఓ బాలీవుడ్ పాటకు చిందేశారు. ప్రణవ్ తన తుపాకులను చేతిలో పెట్టుకుని ప్రదర్శిస్తుండగా తీసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.  

Uttarakhand
khanpur
bjp
mla
pranav singh
  • Loading...

More Telugu News