Andhra Pradesh: చంద్రబాబు అంత గర్విష్టి భారతదేశంలోనే ఎవ్వరూ లేరు!: వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున

  • దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని బాబు అన్నారు
  • రాజకీయ నేతగా కొనసాగే అర్హత కూడా చంద్రబాబుకు లేదు 
  • టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన రూ.700 కోట్లు చేతులు మారాయి 

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అంత గర్విష్టి భారతదేశంలోనే లేరని వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున విమర్శించారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అని చెప్పి దళితులపై దాడులు, అమానుష ఘటనలు జరుగుతుంటే నోరు మెదపని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజకీయ నాయకుడిగా ఉండేందుకు కూడా చంద్రబాబుకు అర్హత లేదని వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన రూ.700 కోట్లు చేతులు మారాయని విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇస్తే చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు పంటలు పండించుకుంటున్న అసైన్డ్ భూములను లాగేసుకున్నారని ఆరోపించారు.  

Andhra Pradesh
Chandrababu
Telugudesam
arrogant
YSRCP
merugu nagarjuna
assembly
  • Loading...

More Telugu News