: తప్పులో కాలేసిన ప్రధాని మన్మోహన్
పొరబాట్లు చేయడం మానవ సహజం. ఇందుకు ఎవరూ మినహాయింపుకాదు. తెలివైనవారూ, బుద్ధిహీనులూ.. ఇలా అందరం, ఎప్పుడో ఒకప్పుడు తప్పులో కాలేస్తుంటాం, ఆనక, 'అరెరె..' అంటూ నాలిక్కరుచుకుంటాం. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సరిగ్గా ఇలానే చేశారు. బుధవారం ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయగా, అందులో ఆయన పుట్టినతేదీ సరికాదని తేలింది.
ఈనెల 10న సంతకం చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన వయస్సు 82 సంవత్సరాలు కాగా, 2007లో రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసిన సమయంలో అఫిడవిట్ ను అనుసరించి ఆయన వయస్సు అప్పట్లో 74 ఏళ్ళు. ఆ లెక్కన 2013 కల్లా ప్రధాని వయస్సు 79 సంవత్సారాలే అవ్వాలి. కానీ, మూడేళ్ళ తేడా వస్తోంది. ఈ విషయమై నాలిక్కరుచుకున్న ప్రధాని ఈనెల 21న జరిగే నామినేషన్ తుది స్క్రూటినీ సందర్భంగా పుట్టినతేదీ తప్పిదాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు.