Subramanian Swamy: వైగో రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: రాజ్యసభ చైర్మన్ కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ

  • హిందీ భాషకు వ్యతిరేకంగా వైగో మాట్లాడారు
  • రాజ్యంగంలోని ఆర్టికల్ 351ని ఉల్లంఘించారు
  • ఇది భారతీయులందరినీ అవమానించడమే అవుతుంది

ఎండీఎంకే అధినేత వైగో ఇటీవలే డీఎంకే సహకారంతో రాజ్యసభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 351ని వైగో ఉల్లంఘించారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అర్హత వైగోకు ఉందో? లేదో? ఎథిక్స్ కమిటీ తేలుస్తుందని చెప్పారు.

హిందీ అనేది అభివృద్ధి చెందిన భాష కాదని... హిందీలో వచ్చిన ఒకే ఒక సాహిత్య పుస్తకం రైల్వే టైమ్ టేబుల్ మాత్రమేనని వైగో వ్యాఖ్యానించారని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఇది భారతీయులందరినీ కించపరచడమే అవుతుందని చెప్పారు. పార్లమెంటులో దేశ ప్రధాని ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని కూడా వైగో వ్యాఖ్యానించారని తెలిపారు. ఆర్టికల్ 351 ప్రకారం హిందీ అధికార భాషగా చలామణి అవుతోందని చెప్పారు.

Subramanian Swamy
Venkaiah Naidu
Vaiko
Rajya Sabha
V Gopala Swamy
MDMK
DMK
BJP
  • Loading...

More Telugu News