Jagan: కొత్త గవర్నర్ భిశ్వభూషణ్ కు ఫోన్ చేసిన వైఎస్ జగన్!

  • ఈ ఉదయం ఫోన్ లో మాట్లాడుకున్న బిశ్వభూషణ్, జగన్
  • రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని జగన్ వినతి
  • గవర్నర్ గా నియమితులైనందుకు అభినందనలు

నవ్యాంధ్రకు గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో బీజేపీ సీనియర్ నేత, ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను నియమిస్తూ నిన్న రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం నూతన గవర్నర్‌ కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయనకు శుభాభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందించాలని బిశ్వభూషణ్ ను కోరారు. మీతో భేటీకి ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఐదేళ్లు దాటినా గవర్నర్‌ గా నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఏపీకి నూతన గవర్నర్ రావడంతో నరసింహన్‌ తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు.

Jagan
Andhra Pradesh
Governer
Bishwabhushan
Phone
  • Loading...

More Telugu News