Uttar Pradesh: బైక్ ఇవ్వలేదని.. పెళ్లైన 24 గంటల్లోనే భార్యకు తలాక్!

  • కట్నం కింద అన్నీ ఇచ్చిన వధువు కుటుంబ సభ్యులు
  • బైక్ ఇవ్వలేదని భార్యతో గొడవ
  • ముమ్మారు తలాక్ చెప్పి వదిలించుకున్న భర్త

పెళ్లిలో తనకు బైక్ పెట్టలేదన్న కారణంతో వివాహమైన 24 గంటల్లోపే భార్యకు తలాక్ చెప్పేశాడో ప్రబుద్ధుడు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిందీ ఘటన. కట్నం కింద తనకు బైక్ ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని భార్యతో గొడవకు దిగిన భర్త.. ఆపై ముమ్మారు తలాక్ చెప్పేశాడు. దీంతో లబోదిబోమన్న వధువు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం కింద అల్లుడు అడిగినవన్నీ ఇచ్చామని, బైక్ ఒక్కటీ ఇవ్వలేకపోయామని వధువు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వరుడు, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Uttar Pradesh
triple talaq
marriage
motorbike
  • Loading...

More Telugu News