Rai Lakshmi: రాయ్ లక్ష్మికి షాకిచ్చిన విద్యుత్ అధికారులు!

  • నెలనెలా డబుల్ అవుతున్న కరెంట్ బిల్
  • ఇలా డబ్బు కట్టాలంటే బాధగా ఉంది
  • ట్విట్టర్ లో వాపోయిన రాయ్ లక్ష్మీ

సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ స్టార్ గా పేరుతెచ్చుకుని, కుర్రకారుకు తన అందంతో కరెంట్ షాకిచ్చే రాయ్ లక్ష్మికి, విద్యుత్ శాఖ అధికారులు షాక్ మీద షాకిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. తన ఇంటి కరెంట్ బిల్ చూస్తే షాక్ కొడుతోందని, ఈ నెలలో ఎంత బిల్ పే చేస్తే, తదుపరి నెలలో అంతకు రెట్టింపు బిల్ వస్తోందని, మూడు నెలలుగా ఇదే జరుగుతోందని ఆమె వాపోయింది.

 ఎలక్ట్రిసిటీ టోల్ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్ చేస్తే స్పందన లేదని, తనకు ఎవరైనా సాయం చేయాలని అభ్యర్థించింది. తనలాగే ఇంకా ఎంతమంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారోనని, ఈ సమస్య నుంచి తననెవరైనా గట్టెక్కించాలని కోరుకుంది. కష్టపడి డబ్బు సంపాదించి ఇలా కట్టాలంటే తనకెంతో బాధగా ఉందని వాపోయింది. ఆమె ట్విట్టర్ పోస్ట్ ను చూసిన ఎలక్ట్రిసిటీ బోర్డు, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ చేస్తే, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Rai Lakshmi
Current
Electricity
Bill
  • Loading...

More Telugu News