England: ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా అర్చర్ కజిన్ దారుణ హత్య.. బాధతోనే ప్రపంచకప్‌లో కొనసాగిన అర్చర్

  • హత్యకు కొన్ని రోజుల ముందే అతడికి మెసేజ్
  • విషయం తెలిసి కన్నీరుమున్నీరైన అర్చర్
  • వెల్లడించిన అర్చర్ తండ్రి ఫ్రాంక్

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ జోఫ్రా అర్చర్‌కు సంబంధించి ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల అర్చర్ కజిన్ అషంటియో బ్లాక్‌మ్యాన్ సెయింట్ ఫిలిప్‌లోని తన ఇంటి బయట దారుణ హత్యకు గురయ్యాడు. విషయం తెలిసి కన్నీరుమున్నీరైన అర్చర్ అంతటి బాధలోనూ ప్రపంచకప్‌లో కొనసాగడానికే మొగ్గుచూపాడని అర్చర్ తండ్రి ఫ్రాంక్ తెలిపాడు.

అషంటియో హత్య అర్చర్‌ను కుంగదీసిందని ఫ్రాంక్ పేర్కొన్నాడు. వారిద్దరూ ఎంతో సఖ్యతగా ఉండేవారని, అషంటియో హత్యకు కొన్ని రోజుల ముందు అర్చర్ అతడికి మెసేజ్ కూడా పంపాడని గుర్తు చేసుకున్నాడు. కాగా, ఈ ప్రపంచకప్‌లో మొత్తం 11 ఇన్నింగ్స్ ఆడిన అర్చర్ 20 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఫలితాన్ని నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌ను కూడా అర్చరే వేశాడు.

England
Jofra Archer
World Cup
Ashantio Blackman
  • Loading...

More Telugu News