kulbhushan jadhav: కుల్‌భూషణ్ జాదవ్ కేసు: నేడు తీర్పు వెల్లడించనున్న అంతర్జాతీయ న్యాయస్థానం

  • కుల్‌భూషణ్‌పై గూఢచర్యం ఆరోపణలు
  • 2016లో జాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పాక్
  • 2017లో మరణశిక్ష విధించిన పాక్ మిలటరీ కోర్టు

నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. భారత నేవీ మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్‌ను 3 మార్చి 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు మోపింది. విచారణ అనంతరం 11 ఏప్రిల్ 2017లో పాకిస్థాన్ మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాకిస్థాన్ సమక్షంలో అంతర్జాతీయ న్యాయస్థానం నాలుగు రోజుల విచారణ జరిపింది. అనంతరం కేసు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో  పాకిస్థాన్‌ న్యాయ బృందం ఒక రోజు ముందే ది హేగ్ చేరుకుంది.

kulbhushan jadhav
Pakistan
ICJ
the hauge
  • Loading...

More Telugu News