SBI: ఎస్‌బీఐకి భారీ జరిమానా విధించిన ఆర్బీఐ

  • నియంత్రణ లోపాలను అధిగమించలేక పోయిన ఎస్‌బీఐ
  • బ్యాంకింగ్ నిబంధనలను విధించిన ఆర్బీఐ
  • ఎస్‌బీఐకి ఆర్బీఐ రూ.7 కోట్ల జరిమానా

బ్యాంకింగ్ మోసాలను పసిగట్టలేకపోవడం, వాటిని నియంత్రించలేకపోవడం, రుణాల వర్గీకరణ చేయలేకపోవడం.. వంటి వైఫల్యాల విషయంలో ఎస్‌బీఐకి ఆర్బీఐ భారీ జరిమానా వడ్డించింది. నిబంధనల ప్రకారం ఎస్‌బీఐకి రూ.7 కోట్ల జరిమానా విధించింది.

ముఖ్యంగా కరెంట్ ఖాతాలు తెరవడం, వాటి నిర్వహణ, ఆదాయ వర్గీకరణ నిబంధనలు, ఆదాయం గుర్తింపు తదితర బ్యాంకింగ్ విధులపై ఆర్బీఐ నిఘా ఉంచుతుంది. ఎస్‌బీఐలో తనిఖీలు చేసిన మీదటే ఈ నిబంధనలేవీ పాటించడం లేదని తెలుసుకుని నోటీసులు పంపామని ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐపై సెక్షన్‌ 47ఎ(1)(సి) బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం 1949 కింద ఆర్బీఐ ఈ జరిమానాను విధించింది.

SBI
RBI
Banking Rules
Regulation Act
Income Recongnisation
  • Loading...

More Telugu News