Kerala: కేరళలో రెడ్ అలర్ట్... అతిభారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ

  • చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు
  • రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • రెడ్ అలర్ట్ ప్రకటించిన కేరళ ప్రభుత్వం

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట వచ్చిన వరదలు ఇంకా కేరళీయులను తీవ్రంగా నష్టపరిచిన నేపథ్యంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ విధించారు. మరికొన్ని ప్రాంతాల్లో యెల్లో, ఆరెంజ్ అలర్ట్ విధించారు. కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Kerala
Rains
IMD
  • Loading...

More Telugu News