Telugudesam: కేసులకు భయపడను.. న్యాయపోరాటం చేస్తా: టీడీపీ నేత కోడెల శివప్రసాద్

  • నేను, నా కుటుంబం నీతి, నిజాయతీలతో బతికాం
  • టీడీపీపై వ్యతిరేకతతో వెళ్లినోళ్లతో మాపై కేసులు పెట్టిస్తున్నారు
  • ఈ విషయం ప్రజలే చెబుతున్నారు

మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో కోడెల మాట్లాడుతూ, ఇప్పటి వరకూ తమ కుటుంబసభ్యులపై 19 కేసులు పెట్టారని అన్నారు. టీడీపీపై వ్యతిరేకతతో వెళ్లిన వారితోనే తమపై కేసులు పెట్టిస్తున్నారని ప్రజలే అంటున్నారని చెప్పారు. ‘ముప్పై ఐదేళ్ల రాజకీయ జీవితంలో నేను, నా కుటుంబం నీతి, నిజాయతీలతో బతికాం. ఈ కేసులకు నేను భయపడను.. న్యాయపోరాటం చేస్తాను’ అని కోడెల అన్నారు.

Telugudesam
Kodela
shiva prasad
ex-speaker
YSRCP
  • Loading...

More Telugu News