Kesineni Nani: ఈ ఉడుత ఊపుళ్లు చిన్నప్పుడే చూశా: 'పీవీపీ' నోటీసులను తేలిగ్గా తీసుకున్న కేశినేని నాని

  • సోషల్ మీడియాలో కేశినేని నాని విజృంభణ
  • సొంతపార్టీ నేతలపైనా విసుర్లు
  • తనపైనా ఆరోపణలు చేశాడంటున్న పీవీపీ వరప్రసాద్
  • నానీకి లీగల్ నోటీసులు

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని తీరు చూస్తుంటే ద్విముఖ పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు సొంత పార్టీ నేతలతో ట్వీట్ల యుద్ధం సాగిస్తున్న ఆయన మరోవైపు, వైసీపీ నేత 'పీవీపీ' వరప్రసాద్ తోనూ వైరానికి తెరలేపారు. తనపై ఆరోపణలు చేశాడంటూ కేశినేని నానీకి వరప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. ఇది టీజర్ మాత్రమేనంటూ హెచ్చరికలు జారీచేశారు. అయితే, వరప్రసాద్ కు కేశినేని నాని ట్విట్టర్ లో బదులిచ్చారు. ఈ ఉడుత ఊపుళ్లు చిన్నప్పుడే చూశానంటూ లీగల్ నోటీసులను చాలా లైట్ గా తీసుకున్నారు. నోటీసులు పంపడం ద్వారా తననేమీ భయభ్రాంతులకు గురిచేయలేరన్న ఉద్దేశంతో నాని ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.

Kesineni Nani
PVP Varaprasad
Telugudesam
YSRCP
Vijayawada
  • Loading...

More Telugu News